రాత్రి పడుకునే ముందు క్లెన్సింగ్ మిల్క్ లో ముంచిన కాటన్ బాల్ తో మెడను తుడిచి, ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కీరదోసకాయ రసంలో,ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి బాగా మిశ్రమంలా తయారు చేయాలి. మిశ్రమాన్ని మెడకు పట్టించి నెమ్మదిగా రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఉదయం చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి మూడు సార్లు , నెలకు మూడు వారాలపాటు చేయడం వల్ల మెడ మీద నలుపు తగ్గుతుంది. అలాగే ముడతలు కూడా నెమ్మదిగా తగ్గుతాయి.