ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కుంకుమ పువ్వు అందానికి ఆరోగ్యానికి చాలా మంచిది. తల్లి గర్భంతో వున్నప్పుడు పాలలో కుంకుమ పువ్వు కలుపుకొని తాగితే పిల్లలు చాలా ఆరోగ్యంగా అందంగా పుడతారు. ఇక యుక్త వయసులో కాంతివంతమైన సౌందర్యం కోసం ఈ పద్ధతులు పాటించండి..మూడు తంతువుల కుంకుమ పువ్వు ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకోని ఒక గిన్నెలో ఈ రెండు పదార్థాలను కలపండి, ఆపై ముఖం మీద అప్లై చేయండి. మెడకి కూడా మాస్క్ వేయండి. కొన్ని నిమిషాల తర్వాత సాధారణ నీటితో క్లీన్ చేసుకోండి. మచ్చలేని చర్మం కోసం వారంలో రెండుసార్లు వేసుకోండి.


ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ గంధం, రెండు, మూడు కుంకుమ పువ్వు రేకులు, రెండు టీ స్పూన్ల పాలను తీసుకోండి. అన్నిటిని కలిపి మిశ్రమంగా చేసి ముఖం, మెడ భాగాలలో రాయండి. దీనిని అప్లై చేసేటప్పుడు సున్నితంగా మసాజ్ చేయండి. ముఖంపై మాస్క్ ఆరిన తర్వాత, మీ ముఖాన్ని కడిగండి. మంచి రిజల్ట్ కోసం వారంలో కనీసం రెండుసార్లు ఈ ప్యాక్ వాడండి.పాలు మీ చర్మానికి తక్షణ మెరుపుని అందిస్తుంది. ఎండ, పొల్యూషన్ కారణంగా కోల్పోయిన మీ సహజ కాంతిని తిరిగి పొందాలని అనుకుంటే ఈ ప్యాక్ మీకు హెల్ప్ చేస్తుంది. చిటికెడు కుంకుమ పువ్వు కలిపిన, నాలుగు టేబుల్ స్పూన్ల పాలను తీసుకుని, కాటన్ బాల్ ఉపయోగించి ముఖం, మెడపై రాయండి.


 కొన్ని నిమిషాలపాటు అలాగే ఉంచి, ప్యాక్ ఆరిన తర్వాత, సాధారణ నీటితో క్లీన్ చేసుకోండి. ఉత్తమ ఫలితాల కోసం రోజు మార్చి రోజు రాయండి.అదే విధంగా రోజు కుంకుమ పువ్వు రేకులు, కొబ్బరి నూనె, రోజ వాటర్‌ని కలిపి దానిని ముఖానికి రాయండి. దీని వల్ల నిగ నిగ లాడే చర్మం మీ సొంతం అవుతుంది.. ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: