నిమ్మకాయ లేదా చింత పండు: ఇవి ఆరోగ్యపరంగానే కాక సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే సిట్రిక్ యాసిడ్, సహజ సిద్ధమైన బ్లీచింగ్ వల్ల అది చర్మంపై ఉన్న మలినాలను తొలగిస్తుంది. మెరిసే ముఖం కోసం నిమ్మరసం, తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత కడగాలి, లేదా చింతపండు రసం కూడా ముఖానికి రాసుకుని ఆరాక కడిగితే ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది.
బంగాళా దుంపలు : ఇవి ముఖ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఆలూ ని పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. దీని వల్ల కళ్ళ కింద ఉండే నల్ల మచ్చలు తొలగిపోతాయి.
తేనె: మొటిమలు ఉన్నా, ఆయిలీ స్కిన్ అయినా తేనెలో దాల్చిన చెక్క పొడి కలిపి రాస్తే చక్కటి గుణం ఉంటుంది. అలాగే తేనె ను రోజుకి రెండు సార్లు ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది.
పసుపు: పసుపు ఆరోగ్య పరంగానే కాక సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. పసుపు,తేనె, నిమ్మరసం కలిపి మిక్స్ చేసి ముఖానికి రాసి కాసేపు ఆగి కడగాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేసి ఫ్రెష్ గా కనపడేలా చేస్తుంది.
మెంతులు: ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నానబెట్టి తర్వాతి రోజు మెత్తగా రుబ్బాలి. ఆ మిశ్రమానికి తేనె కలిపి ముఖానికి పూతలా వేయాలి ఇలా చేయడం వల్ల ముఖంపై ముడతలు కనపడవు. వయసు ముదురుతున్న ఛాయలు ఉండవు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి