అందంగా మెరిసిపోవాలంటే శరీరం హైడ్రేట్ గా ఉండేందుకు తప్పనిసరిగా నీళ్ళు తాగాలి. శరీరంలోని మలినాలని పారద్రోలెందుకు నీరు చాలా సహాయపడుతుంది. ప్రతి రోజు 3-4 లీటర్ల నీటిని తాగాలి. నీరు కాలుష్య కారకాలను సమర్థవంతంగా తొలగించడంలో సహాయపడటమే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. కొద్దిగా నారింజ రసం లేదా పుదీనా ఆకులు, స్ట్రాబెర్రీలు, నిమ్మకాయలను కలపడం ద్వారా పోషకాలను మాత్రమే కాకుండా రుచిగా ఉండే డిటాక్స్ డ్రింక్‌ని కూడా తయారు చేసుకోవచ్చు.వ్యాయామం చేయడం చాలా అవసరం. చెమట పట్టడం అనేది చర్మాన్ని కాలుష్య కారకాల నుంచి విముక్తి చేస్తుంది. ఆర్సెనిక్, సీసం, పాదరసం వంటివి చెమట ద్వారా చర్మం నుంచి బయటకి తొలగించబడతాయి. వ్యాయామం ఆరోగ్యంగా, చురుకుగా ఉంచడమే కాకుండా హానికరమైన టాక్సిన్స్ తొలగించడంలోనూ సహాయపడతాయి.స్మూతీలు రుచికరమైనవే కాదు ఆరోగ్యం కూడా. స్మూతీ చెయ్యడానికి ఉపయోగించే బచ్చలికూర, కాలే వంటి ఆకు కూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీరు చేసుకునే స్మూతీలో దోసకాయ, పాలకూర, బీట్ రూట్, క్యారెట్, యాపిల్, అరటిపండు, స్ట్రాబెర్రీలను కూడా జోడించుకోవచ్చు. క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి స్థాయి పెరుగుతుంది.


 రిఫ్రెష్ గా ఉండటానికి అల్పాహారం లేదా రాత్రి పూట అయినా దీన్ని తీసుకోవచ్చు.టాక్సిన్స్ బయటకి పంపించాలంటే హైడ్రేట్ గా ఉండటం చాలా ముఖ్యం. కహ్వా టీ వంటి హెర్బల్ టీ ఒక కప్పు తాగడం ఆరోగ్యానికి అన్నీ విధాలుగా మేలు చేస్తుంది. జీవక్రియని పెంచి బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా ఈ టీ తీసుకోవడం వల్ల కొవ్వు కరిగిపోయి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.శుద్ది చేసిన, ప్రాసెస్, ప్యాక్డ్ ఫుడ్, డీప్ ఫై చేసిన ఆహార పదార్థాలు అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. నూనె, ఉప్పు, చక్కెర అధిక వినియోగం శరీరానికి హాని చేసి అనారోగ్య సమస్యలని తీసుకొస్తుంది. అందుకే దాని నుంచి బయట పడాలంటే సేంద్రీయ ఉత్పత్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాసెస్ చేసిన ఆహారం తినడం కంటే సేంద్రీయ పండ్లు, కూరగాయలు ఎంచుకోవాలి. అదనంగా వీలైనంత వరకు నూనె, ఉప్పు, చక్కెర తీసుకోవడం తగ్గించాలి.మనం తీసుకునే ఆహారం కారణంగా శరీరంలో అనేక మలినాలు పేరుకుపోతాయి. వాటిని అంతర్గతంగా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని డిటాక్సీఫికేషన్ అంటారు. ఆయుర్వేదం ఆమోదించిన బాడీ డిటాక్స్ ఫాలో అయితే ఊహించిన దానికంటే ఎక్కువ మేలు చేస్తుంది. ఈ డిటాక్స్ వల్ల శరీరం నుంచి విషాన్ని, కణజాలం నుంచి అదనపు వాత, పిత్త, కఫ దోషాలని తొలగిస్తుంది. జీర్ణవ్యవస్థ ద్వారా ఈ టాక్సిన్స్ తొలగించబడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: