తెల్ల జుట్టుని నల్లగా మార్చే న్యాచురల్ ఆయిల్ ఇదే ?

ప్రస్తుత కాలంలో చాలా మందికి కూడా చాలా చిన్న వయసులోనే తెల్లజుట్టు సమస్య మొదలవుతుంది. తెల్ల జుట్టును తిరిగి నల్లగా మార్చుకోవటానికి చాలా రకాల రసాయన రంగులను ఉపయోగిస్తుంటారు కొందరు.అయితే, ఇలాంటి రసాయన రంగుల వాడకం చాలా ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి, ఇలాంటి సమస్యకి సహజ పద్ధతిని అనుసరించటం వల్ల తెల్ల జుట్టు బారినపడకుండా ఉంటారని చెబుతున్నారు.అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ప్రతి రోజూ ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇంకా అంతే కాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. జుట్టు రాలటం, జుట్టు రంగు నెరిసి పోవటం వంటి సమస్యలకు వేప దివ్యౌషధం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకోసం వేప ఆకులను తీసుకొని వాటిని నీళ్లలో వేసి బాగా మరిగించి..ఆ నీటితో తలస్నానం చేస్తే జుట్టు రాలడం ఈజీగా తగ్గుతుంది.


ఇంకా క్రమంగా జుట్టు రంగు కూడా మారుతుంది. జుట్టు రాలడం ఇంకా నెరిసిన జుట్టు సమస్యతో బాధపడేవారు రోజూ వేప ఉత్పత్తులను తీసుకోవాలి. దీని లక్షణాలు తీవ్రమైన జుట్టు సమస్యలను చాలా ఈజీగా దూరం చేస్తాయి.జుట్టు రాలడం ఇంకా చుండ్రు సమస్యతో ఎక్కువగా బాధపడేవారు రోజూ కెమికల్ ఆధారిత ఉత్పత్తులను వాడే బదులు ఇలా ఆయుర్వేద గుణాలున్న వేప షాంపూ వాడితే మంచి ఫలితాలు పొందవచ్చు. వేప ఆకుల పేస్టును జుట్టుకు పట్టించడం వల్ల ఖచ్చితంగా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా అలాగే జుట్టు రాలడం ఆగిపోయి బాగా ఒత్తుగా మారుతుంది. చిన్న వయసులో ఇలా తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు వేపనూనెను క్రమం తప్పకుండా వాడాలి. ఈ నూనెలోని ఔషధ గుణాలు తెల్ల వెంట్రుకలను చాలా ఈజీగా ఇంకా శాశ్వతంగా నల్లగా మారుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: