ఈ రోజుల్లో ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, జన్యుపరమైన సమస్యలు ఇలా చాలా కారణాల వల్ల చాలా మందికి కూడా జుట్టు ఊడిపోతుంది. అయితే చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి చాలా రకాల షాంపులను వాడుతూ ఉంటారు. ఈ షాంపులను వాడితే వాటిలో ఉండే రసాయనాల వల్ల  జుట్టు మరింతగా ఊడిపోతుంది.పెద్దగా ఖర్చు లేకుండా కేవలం ఒకే ఒక పదార్ధంతో మనం సులభంగా జుట్టు ఊడిపోవడాన్ని తగ్గించుకోవచ్చు.  దీనిని వాడడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. చాలా తక్కువ ఖర్చులో జుట్టు ఊడిపోవడాన్ని మనం తగ్గించుకోవచ్చు. జుట్టు ఊడే సమస్యని తగ్గించే ఆ పదార్థం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఎర్ర ఉల్లిపాయ మనకు చాలా బాగా సహాయపడుతుంది. దీనిని వాడడం వల్ల జుట్టు కుదుళ్లు చాలా బలంగా తయారవుతాయి. ఇంకా అలాగే తలలో దురద, అకాల బట్టతల, తలలో ఇన్పెక్షన్, జుట్టు చిట్లడం వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి.


జుట్టు కుదుళ్లను బలంగా, ఆరోగ్యంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఎర్ర ఉల్లిపాయ మనకు చాలా బాగా సహాయపడుతుంది.ఎర్ర ఉల్లిపాయను తీసుకొని దానిని ముక్కలుగా చేసి ఒక జార్ లో వేసుకోవాలి. ఇక ఆ తరువాత మెత్తగా మిక్సీ పట్టుకుని వడకట్టి దాని నుండి రసాన్ని తీసుకోవాలి. ఆ తరువాత ఈ ఉల్లిపాయ రసాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి దాకా బాగా పట్టించాలి. అయితే ఉల్లిపాయ వాసన పడని వారు దీనిని కొబ్బరి నూనెలో లేదా ముల్తానీ మట్టితో కలిపి జుట్టుకు రాసుకోవచ్చు. ఈ విధంగా ఉల్లిపాయ రసాన్ని బాగా పట్టించి అరగంట పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో తలస్నానం చేయాలి.అయితే ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల 2 నుండి 3 నెలల్లోనే మనం ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎర్ర ఉల్లిపాయను ఉపయోగించడం వల్ల ఒత్తైన, అందమైన జుట్టును పొందవచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ పాటించండి. జుట్టు సమస్యలని చాలా ఈజీగా తగ్గించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: