ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కరోనా విజృంభణతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారికి ప్రయోజనం చేకూర్చేలా పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. జగన్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ తొలివారంలో జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించనుంది. ప్రభుత్వం ఈ పథకం కింద రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు 10,000 రూపాయలు జమ చేయనుంది. 
 
ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల ద్వారా ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రంలో 2,50,015 మంది ఈ పథకానికి అర్హత సాధించారు. ఈరోజు నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ప్రభుత్వం వీరి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనుంది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఈ పథకం ద్వారా అర్హులైన వారికి 10,000 రూపాయలు ఖాతాలలో జమ చేయనుంది. కరోనా కష్ట కాలంలో సైతం జగన్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: