సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్టార్ హీరోలు ప్రముఖులు ఆయనకు విష్ చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలి అని కోరుకుంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇక ఆయన కుమారుడు హీరో మహేష్ బాబు తండ్రికి విష్ చేసారు.
తాను ఇలా ఉండటానికి మీరే కారణం నాన్న... మీకు రుణపడి ఉన్నాను అని మహేష్ బాబు పేర్కొంటూ తండ్రి తో కలిసి దిగిన ఒక ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. తన ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అంటూ పేర్కొన్నాడు. దీనికి మంచి స్పందన వస్తుంది. కాగా తన తండ్రి పుట్టిన రోజున మహేష్ సినిమా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
All that I am and trying to be... I owe it all to you!! Happy birthday, Nana❤️ My evergreen superstar 😍😍😍 pic.twitter.com/miSMNCCycC
— mahesh babu (@urstrulyMahesh) May 30, 2020