తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతుంది.. మొన్నటి వరకు ఎండలు మండిపోయాయి.  ముఖ్యంగా ఆదిలాబాద్ వైపు ఎండలు మండేలా ఉన్నాయి. కానీ ఇప్పుడు వరుణుడు కరుణించాడు.. వాతావరణం కాస్త చల్లబడింది. ఈ సమయంలో నిర్మల్‌ జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీలో గతంలో రెండు సార్లు అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెల్సిందే.  ఆదివారం ఉదయం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అకడమిక్ బ్లాక్-1లో ఉన్న ఫర్నిచర్, ప్రొజెక్టర్, 70 కుర్చీలు, 21 టేబుళ్లు దగ్ధమయ్యాయి.

 

స్థానికులు వాకింగ్ కి రాగా అక్కడ కళాశాల భవనం నుంచి మంటలు ఎగసిపడుతోన్న విషయం వెంటనే అధికారుకలు తెలియజేశారు. యూనివర్సిటీ అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు భైంసా నుంచి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగిందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. గత రెండు నెలల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై విద్యాలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: