ఏపీలోని అన్ని జిల్లాల కంటే క‌ర్నూలు జిల్లాలో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న తాజా అప్‌డేట్‌ను బట్టి చూస్తే జిల్లాలో కరోనా కేసులు రెండు వేలు దాటాయి. జిల్లాలో రోజుకు 70 నుంచి 90 మంది దాకా వైరస్ భారిన పడుతున్నారు. బుధ‌వారం ఒక్క రోజే జిల్లాలో 90 మందికి క‌రోనా నిర్దార‌ణ అయ్యింది. దీంతో మొత్తం కేసులు 2 వేలు దాటి 2045కు చేరుకున్నాయి. వీరిలో 922 మంది వివిధ ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 1055 మంది కరోనా నుంచి విముక్తి పొందారు. జిల్లాలో మరో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలో కరోనా మరణాల సంఖ్య 68కి చేరింది. ఒక్క జూన్ నెల‌లోనే ఏకంగా 1312 కేసులు న‌మోదు అయ్యాయి.

 

ప్ర‌స్తుతం ఉన్న లెక్క‌ల‌ను బ‌ట్టి చూస్తే జిల్లాలో క‌రోనా వీర‌విహారంతో ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. జూలై నెల‌లో వ‌ర్షాలు ఎక్కువుగా ప‌డే ఛాన్సులు ఉండ‌డంతో ఈ నెల‌లో క‌రోనా మ‌రింత విల‌య తాండ‌వం చేస్తుంద‌న్న సందేహాలు ఉన్నాయి. మ‌రి క‌ర్నూలు జిల్లా ప్ర‌జ‌లు క‌రోనా నుంచి ఎలా సేఫ్ అవుతారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: