ఈడీ కేసులో టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కు హైకోర్టులో తాజాగా ఊరట లభించింది. రవి ప్రకాష్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు అనుమతి ఇచ్చింది, ఓ వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా వేదించడానికే ఇన్ని కేసులు బనాయిస్తున్నారు అంటూ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. రవిప్రకాష్ ను అరెస్టు చేయడానికి వీలు లేదు అంటూ తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది తెలంగాణ హైకోర్టు. దీంతో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కు కాస్త ఊరట లభించినట్లయింది.
అయితే టీవీ9 కంపెనీ పేరిట అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి 2018 సెప్టెంబర్ నెల నుంచి 2019 మే నెల వరకు ఎలాంటి అనుమతులు లేకుండానే ఏకంగా 18 కోట్ల రూపాయల నిధులను ఉపసంహరించారు అంటూ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై గతంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే, ఇక ఇటీవల ఇదే అంశంపై రవిప్రకాష్ పై ఈడీ నమోదయింది. దీనికి సంబంధించి హైకోర్టులో విచారణ జరిగగా... ఈడీ ని తప్పుబడుతూ రవి ప్రకాష్ కు బెయిలు మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి