
మాన్సాస్ ఛైర్మన్ గా తిరిగి నియమితులు అయిన అశోక్‌గజపతిరాజు మీద వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మళ్ళీ ఫైర్ అయ్యారు. ఈ 40 ఏళ్లలో మీ హిందూత్వం ఎటు పోయింది అశోక్? మీరు ఛైర్మన్ గా ఉన్న గుళ్లోనే విగ్రహాలు ధ్వంసం జరిగినప్పుడు ఏమైపోయారు? అని ఆయన ప్రశ్నించారు. మాన్సాస్ లో ఆడిటింగ్ చేయనప్పుడు మీ పారదర్శకత ఏమైపోయింది? మీరు మంత్రిగా వెలగబెట్టినప్పుడే మోతీ మహల్ కూల్చారు కదా, అప్పుడెక్కడికి పోయింది మీ చారిత్రక వారసత్వం? అని ఆయన ప్రశ్నించారు.
ఇక నిన్న కూడా విజయనగరంలో లెప్రసీ ఇన్‌స్టిట్యూట్‌కు ఉన్న 100 ఎకరాలకుపైగా భూమి తనదేనని ప్రకటించుకుని కాజేసేందుకు అశోక్‌గజపతిరాజు ప్రయత్నిస్తున్నారని సాయి రెడ్డి విమర్శించారు. భూ ఆక్రమణలకు పాల్పడేవారు ఎంతటి వారైనా సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉపేక్షించరని అన్నారు. వారి మీద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు.