
ముఖ్యమంత్రి జగన్మోన్ రెడ్డి తో నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉందని ఏపి ముఖ్యమంత్రి నివాసం సమీపంలో ఉండే అమరరెడ్డి కాలనీకి చెందిన మహిళా సోషల్ మీడియా వేదికగా గోడు విన్నవించుకుంది. కాలనీకి చెందని వడియం శివశ్రీ తనకు అన్యాయం జరిగిందని, న్యాయపోరాటం చేస్తున్న నాపై తిరిగి కేసు నమోదు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని అవేదన వ్యక్తం చేస్తోంది.
స్టేషన్ కు పిలిపించిన తనను మహిళ అని కూడా చూడకుండా సాయంత్రం 6 గంటలకు పిలిపించి, రాత్రి 10 గంటల వరకు విచారణ పేరుతో కూర్చొపెడుతున్నారని వాపోయింది. సీఎం నివాసం వెనుక కరకట్ట నివాసాల కేటాయింపు విషయంలో తనకు అన్యాయం జరిగిందని న్యాయం కోసం పోరాడుతున్న శివ శ్రీ ఈ మధ్యకాలం జనసేనాని పవన్ కళ్యాణ్ ను కూడా కలిసి తన గోడు చెప్పుకుంది.
వలంటీర్ గా పని చేసి ఇటీవల ఉద్యోగానికి రాజీనామ చేసి న్యాయపోరాటానికి దిగినట్లు శివ శ్రీ చెప్పుకొచ్చారు. రక్షించాల్సిన పోలీసులు ఇలా తనను టార్గెట్ చెయ్యడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకొంటుంది.