
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రాధేశ్యామ్ అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగ బోతున్నట్లుగా కొద్దిసేపటి క్రితమే అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించింది. నిజానికి ఈ సినిమా ఈ రోజు విడుదల చేస్తాం అంటూ గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి నిన్నటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
కానీ నిన్న రాత్రి పొద్దుపోయాక కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ చేయడం లేదని దాని బదులు అప్డేట్ ఒకటి ఇస్తామని నిన్న ప్రకటించారు. అలా ప్రకటించినట్టుగానే కొద్దిసేపటి క్రితం ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో నడుస్తూ వస్తున్న పోస్టర్ విడుదల చేశారు. సినిమా 14 జనవరి 2022వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది అంటూ ప్రకటించారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ రానా సినిమాతో పాటు సర్కారు వారి పాట కూడా ఉండగా వారితో పాటు ఇప్పుడు ప్రభాస్ కూడా బరిలోకి దిగడం ఆసక్తి రేకెత్తిస్తోంది.