కర్ణాటకలో కోవిడ్ -19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా నియమితులైన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి అన్ని జిల్లాలను పరిస్థితిని నిశితంగా పరిశీలించి, అవసరమైతే నియంత్రణ చర్యలు తీసుకోవాలని విధించాలని ఆదేశించారు. గురువారం అక్కడ 2,052 కోవిడ్ -19 కేసులు, 35 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 29,01,247 కి, మరణాల సంఖ్య 36,491 కి పెరగడంతో సిఎం బొమ్మై నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంది.

కొత్తగా నియమితులైన కర్ణాటక ముఖ్యమంత్రి ఈ రోజు ఢిల్లీని సందర్శించి ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ "కేరళలో కోవిడ్ కేసులు పెరిగాయి. మాకు మూడు సరిహద్దు జిల్లాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్‌లతో మాట్లాడాము. వైద్య సదుపాయాలను కూడా సిద్ధం చేయమని, అప్రమత్తంగా ఉండాలని వారిని కోరాము" అని ఆయన చెప్పారు. ఆయన తిరిగి కర్ణాటక చేరుకున్నాక దీనికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇక కేరళ ప్రభుత్వం గురువారం జూలై 31 నుండి ఆగస్టు 1 వరకు పూర్తి లాక్డౌన్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: