సింగరేణి రాత పరీక్ష ఈ నెల లో రెండు సార్లు జరగబోతుంది. మొదటి దఫా నెల 8 వ తేదీన 128 ఫిట్టర్ ఉద్యోగాలకు రాత పరీక్ష జరుగుతుండగా, కొత్తగూడెం లోని 5 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ జరుగుతుంది. ఈ పరీక్షల్లో సెక్యూరిటీ అత్యంత భారీగా ఉండబోతుంది. పరీక్ష నిర్వహణ కేంద్రాల్లో మెటల్ డిటెక్టర్ లు సైతం వినియోగించబోతున్నారు. ఇక సింగరేణి పరీక్ష కోసం 2,681మంది అభ్యర్థులు ఎదురు చూస్తుండగా, ఈ పరీక్షల్లో ప్రతిభ చూపిన అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగ అవకాశం ఉంటుంది. పరీక్ష పూర్తి కాగానే ఫలితాలు ఉంటాయని, అలాగే ఎవరైనా పరీక్షల్లో మోసం చేయాలనీ భావిస్తే లేదంటే డబ్బు వసూళ్లకు పాల్పడితే వారి పై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అని సింగరేణి యాజమాన్యం తెలిపింది. ఇక పరీక్ష కేంద్రాన్ని మెటల్ డిటెక్టర్లతో చెక్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: