బ్రిట‌న్లో ప‌దిరోజుల క్వారంటైన్ పూర్తిచేసుకున్న భార‌త క్రికెట్ జ‌ట్టు కోచ్ ర‌విశాస్త్రి, బౌలింగ్ కోచ్ అరుణ్‌, ఫీల్డింగ్ కోచ్ శ్రీ‌ధ‌ర్ భార‌త్ రావ‌డానికి సిద్ధంగా ఉన్నారు. వీరు ఐసోలేష‌న్ పూర్తిచేసుకున్న‌ప్ప‌టికీ ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లో నెగ‌టివ్ వ‌స్తేనే భార‌త్ రావ‌డానికి అనుమ‌తి ల‌భించ‌నుంది. కొవిడ్ నుంచి కోలుకున్న‌వారు ప్ర‌యాణం చేయాలంటే ఫిట్ టు ఫ్లై ప‌రీక్ష‌కు కూడా వారు హాజ‌రు కావాల్సి ఉంటుంది. ర‌విశాస్త్రి, అరుణ్‌, శ్రీ‌ధ‌ర్‌లు శారీరకంగానే బాగానేవున్నార‌ని, ప్ర‌యాణం చేయాలంటే సీటీ స్కోర్ 38 ప్ల‌స్ రావాల‌ని, ఐసోలేష‌న్‌ను వీరు వీడార‌ని బీసీసీఐ అధికారి ఒక‌రు తెలిపారు. రెండు మూడురోజుల్లో వీరంతా భార‌త్ బ‌య‌లుదేర‌తార‌ని భావిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. భార‌త‌జ‌ట్టు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ప్పుడు నాలుగో టెస్టు స‌మ‌యంలో కోచ్ ర‌విశాస్త్రికి క‌రోనా సోక‌డంతో ఇత‌ర కోచ్‌లు కూడా ఐసోలేష‌న్లోకి వెళ్లారు. కొవిడ్ భ‌యంతోనే భార‌త్‌, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన ఐదోటెస్టు ర‌ద్ద‌యింది. కానీ ఆ టెస్టు జ‌రుగుతుంద‌ని వేల్స్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: