మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి ఇప్పుడు ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఈ కేసు విషయంలో సిబిఐ అధికారులు దాదాపుగా విచారణ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చివరి దశకు చేరుకున్నది సిబిఐ విచారణ. వివేకా హత్యకేసులో పులివెందుల కోర్టులో చార్జిషీటు దాఖలు చేసారు సిబిఐ అధికారులు. కడప నుంచి పులివెందుల కోర్టుకు చేరుకున్న సిబిఐ అధికారుల బృందం...

కేసుకు సంబంధించి వివిధ పత్రాలతో కోర్టుకు వచ్చినట్టు తెలుస్తుంది. వచ్చే నెల 4 తేదికి సునీల్ అరెస్ట్ అయి 90 రోజులు గడుస్తున్న నేపధ్యంలో సునీల్ కుమార్, ఉమాశంకర్ రెడ్డి ఇరువురి పై చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తన తండ్రి వైఎస్ వివేకా కేసు చార్జి షీటు కాపీ ఇవ్వాలని కోర్టును విన్నవించుకున్నారు వివేకా కుమార్తె సునీత.

మరింత సమాచారం తెలుసుకోండి: