ఆంధ్రప్రదేశ్ లో అధికారులు కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి ఇబ్బందికరంగా వ్యవహరించడంతో ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ మధ్య కాలంలో ఐఏఎస్ అధికారుల విషయంలో కాస్త సీరియస్ గా వ్యవహరిస్తుంది. తాజాగా ఏపీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజిత్ భార్గవ్ కు హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం సంచలనం అయింది. ఇన్స్టెంట్ బీర్ తయారీ మైక్రో బ్రేవరీ ఏర్పాటుకు అనుమతికై దాఖలు చేసుకున్న అర్జీపై స్పందించని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పై కోర్ట్ సీరియస్ అయింది.

దానిపై హైకోర్టును ఆశ్రయించిన అర్జీదారు పిటీషన్ పై కోర్ట్ విచారణ జరిపింది. ప్రభుత్వ వివరణకై గత వాయిదా రోజున ఎక్సైజ్  ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజిత్ భార్గవ్ ను హాజరవ్వమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను పాటించకపోవడం వల్ల రజిత్ భార్గవ్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనం.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap