ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వేర్వేరుగా సీఎం వైఎస్ జగన్ లేఖలు రాసారు. భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయింది అని తక్షణ సాయంగా రూ.1000 కోట్లు రాష్ట్రానికి మంజూరు చేయాలి అని విజ్ఞప్తి చేసారు. వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరిన సీఎం... నాలుగు జిల్లాల్లో అసాధారణంగా 255 శాతం మేర అధిక వర్షపాతం నమోదైంది అని తెలిపారు. చాలాచోట్ల 20 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం కురిసింది అని వివరించారు.

తిరుపతి, తిరుమల, నెల్లూరు, మదనపల్లె, రాజంపేట వంటి ప్రాంతాల్లో భారీవర్షాలకు నీటమునిగాయి అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. 196 మండలాలు నీటమునిగాయి అని ఆయన పేర్కొన్నాయి. 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం అని వివరించారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో రహదారులు, చెరువులు, కాల్వలు కోతకు గురయ్యాయి అని పేర్కొన్నారు. చెరువులకు గండ్లు పడడం ద్వారా చాలా ప్రాంతాలు నీటమునిగాయి అని తెలిపారు. తక్షణ సాయంగా రూ.1000 కోట్లు రాష్ట్రానికి మంజూరు చేయాలి అని విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: