నందమూరి బాలకృష్ణ సంక్రాంతి వేళ తన సోదరి పురందేశ్వరి ఇంట్లో సందడి చేశారు. ప్రకాశం జిల్లా కారంచేడులోని సొదరి పురందేశ్వరి నివాసానికి బాలయ్య సకుటుంబ సమేతంగా విచ్చేశారు. కారంచేడులోని సోదరి పురంధరేశ్వరి నివాసంలో బాలకృష్ణ సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. కారంచేడులో నిర్వహించిన భోగి వేడుకల్లో బాలకృష్ణ పాల్గొన్నారు.


తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన నందమూరి బాలకృష్ణ.. సమాజంలో సంపద పెంచే పండుగ సంక్రాంతి అని కొనియాడారు. రైతన్న చెమటోడ్చి పండించిన పంటలు ఇంటికి చేరే పండుగ సంక్రాంతి అని బాలకృష్ణ అన్నారు. ఈ పండుగ వేళ తెలుగు కుటుంబాలన్నీ పండుగ శోభతో కళకళలాడాలని.. అందరికీ శుభం జరగాలని బాలయ్య కోరుకున్నారు.


తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు విలువ ఇచ్చే నందమూరి బాలకృష్ణ ప్రతి సంక్రాంతిని వినూత్నంగా జరుపుకుంటారు. ఈసారి తన సోదరి ఇంట భోగి మంటల్లో పాల్గొంటూ బాలయ్య సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: