బాపట్ల ఎంపీ నందిగామ సురేష్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అదిరిపోయే సెటైర్లు వేశారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో పర్యటించిన సినీ నటుడు, జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ పలు కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా లో ఏం యాక్షన్ చేస్తున్నాడో తెలియదు కానీ ప్రజల్లో మాత్రం బాగానే యాక్షన్ చేస్తున్నాడని బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఒకసారి వచ్చి బాపట్ల లో పుట్టానని, మరోసారి  చీరాలలో పుట్టానని అన్నారని.. ఇటీవల పర్చూరు వచ్చిన సమయంలో కనిగిరి లో పుట్టానని  చెప్పడం ఏంటని ప్రశ్నించారు.

ప్రజలకు ఏమి చెప్పినా నమ్మేస్తారులే అంటూ బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ విమర్శలు  చేశారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ వైసీపీ  ప్లీనరీ సమావేశం  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ ఈ కామెంట్లు చేశారు. ఈ సమావేశంలో   అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ బాచిన కృష్ణ చైతన్య, మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాచిన చెంచు గరటయ్య కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: