తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ తరచూ చెబుతుంటారు. కానీ అలాంటి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోవడం ప్రభుత్వ ప్రతిష్టను, సీఎంగా కేసీఆర్ ప్రతిష్టను మంటగలుపుతోంది. జీతాలివ్వడం చేతగాని సీఎం ఆర్దిక క్రమశిక్షణ గురించి మాట్లాడటమా అంటూ విపక్షాలు విమర్శించే పరిస్థితి వచ్చింది. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని నిండా ముంచిన మీరు నీతులు వల్లిస్తారా అంటూ విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం మరిన్ని అప్పులకు అనుమతిస్తే తెలంగాణను మరో శ్రీలంకలా మార్చాలనుకుంటున్నారా అని ఇటీవల బండి సంజయ్ మండపడ్డారు. కేంద్రం ఇచ్చే నిధులతో కాలం వెళ్లబుచ్చుతూ కేంద్రంపైనే విమర్శలా అంటూ ప్రశ్నించారు.


సోషల్ మీడియాలోనూ ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాని విషయం ప్రముఖంగా ట్రోల్ అవుతోంది. లోన్‌ కోసం ఫోన్‌ చేసిన ఓ ఉద్యోగినికి.. ముందు కేసీఆర్‌కు లోన్ ఇవ్వండమ్మా అంటూ ఓ ఉద్యోగి మాట్లాడిన ఆడియో ఇటీవల బాగా వైరల్ అయ్యింది. మొత్తం మీద జీతాల సమస్య కేసీఆర్‌ సర్కారు పరువు తీసేస్తందని చెప్పక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: