ఇదో కొత్త రకం మోసం.. ట్రస్టులకు విరాళంగా వచ్చిన వైట్‍ మనీ తమ దగ్గర ఉందని 35 లక్షల నగదు చేతికి ఇస్తే మరో 35 లక్షలు కలిపి 70 లక్షలు తిరిగి ఇస్తామని ఆశ చూపి ఏకంగా 35 లక్షలు కొట్టేసిన ఘటన తిరుపతి సమీపంలో వెలుగు చూసింది. ఓ ముఠా ఓ రియల్టర్‌ నుంచి 35 లక్షలు దోపిడి చేసిన కేసులో 12 మంది ముద్దాయిలను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు.


అసలేమైందంటే.. ఈ నెల 3న చంద్రగిరి సమీపంలో తెలంగాణ యాదాద్రి జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శంకర్‍ రెడ్డి నుంచి కొందరు దుండగులు కళ్ళల్లో కారం చల్లి నగదు దోచుకెళ్ళారు. ఈ సంఘటనలో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు దోపిడి తీరును గుర్తించారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన కృష్ణమూర్తి, కర్ణాటకకు చెందిన మహిళతో కలిసి దోపిడికి పాల్పడినట్లు తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: