తిరుపతి రైల్వేస్టేషన్‍ ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అంటున్నారు. ప్రయాణికులకు అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు స్టేషన్ అభివృద్ధి పనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు అరుణ్ కుమార్ జైన్ వివరించారు. 300 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టామని అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. దక్షిణం వైపు నిర్మాణ పనులు, ఉత్తరం వైపు ఆధునికీకరణ పనులు చేయనున్నట్లు అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.


మొత్తం 33 నెలల నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా అన్ని స్థాయిలో పనులు పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అరుణ్ కుమార్ జైన్ అన్నారు. దక్షిణం వైపు ప్రవేశ పనులు పూర్తైన అనంతరం ఉత్తరం వైపు పనులు ప్రారంభిస్తామని అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. తిరుపతి రైల్వేస్టేషన్ దక్షిణం వైపు జరుగుతున్న అభివృద్ధి పనులను అరుణ్ కుమార్ జైన్ పరిశీలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: