తెలంగాణలో మరో భారీ పెట్టుబడి పెట్టే సంస్థ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అమరరాజా గ్రూప్ భారీ పెట్టుబడి పెట్టనుంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీల తయారీ యూనిట్ ఏర్పాటును  అమరరాజా గ్రూప్  చేయనుంది. లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీని  అమరరాజా గ్రూప్ తెలంగాణలో  నెలకొల్పనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, అమరరాజా సంస్థ మధ్య  అవగాహనా ఒప్పందం కుదురుతోంది.

మంత్రి కేటీఆర్, అమరరాజా బ్యాటరీస్ ఛైర్మన్ జయదేవ్ గల్లా సమక్షంలో ఒప్పందం కుదురుతోంది. ఈ అమర్‌రాజా సంస్థ గతంలో ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టింది. దీని ఛైర్మన్‌ గల్లా జయదేవ్‌ టీడీపీ ఎంపీ అన్న సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయ్యాక.. తన పరిశ్రమలను అడ్డుకుంటున్నారని గల్లా జయదేవ్ ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీలపై కావాలని తనిఖీలు చేయించారని.. లేనిపోని తప్పులు చూపిస్తున్నారని అంటున్నారు. బహుశా ఆ కోపంతోనే కావచ్చు.. తన కొత్త ఫ్యాక్టరీని ఆయన ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో పెడుతున్నారు. ఇటీవలే జాకీ సంస్థ కూడా ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: