కొన్ని గంటల్లో తెలంగాణలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. గెలిచేదెవరో తేలబోతోంది. నవంబర్‌ 30న పోలింగ్ జరిగిన ఈ తెలంగాణ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏమిటనేది కొన్ని గంటల్లో తేలబోతోంది. తెలంగాణలో ఒకే విడతలో 119 నియోజకవర్గాలకు పోలింగ్‌ పూర్తయింది. తెలంగాణ
రాష్ట్రవ్యాప్తంగా 71.34 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మునుగోడులో 91.89 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యల్పంగా యాకుత్‌పురలో 39.64 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఇవాళ 2290 మంది అభ్యర్థుల భవితవ్యం  తేలబోతోంది.

ఇక పార్టీల లెక్కలు చూస్తే.. అధికార బీఆర్‌ఎస్‌ 119 నియోజకవర్గాల్లోనూ బరిలో నిలిచింది. కాంగ్రెస్ మాత్రం 118 నియోజకవర్గాల్లో బరిలో దిగింది. ఒక స్థానంలో ఆ పార్టీ సీపీఐ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. 111 నియోజకవర్గాల్లో బీజేపీ, 8 స్థానాల్లో జనసేన పొత్తుతో పోటీ చేశాయి.  
108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీకి దిగారు. ఇక సీపీఎం 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. మజ్లిస్‌ పార్టీ అభ్యర్థులు 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: