లోక్‌సభ ఎన్నికల కోసం కేసీఆర్‌ కసరత్తు ప్రారంభించారు. ఆ పార్టీకి అభ్యర్థులు దొరకడం కష్టమవుతోంది. మొత్తం 17 స్థానాల్లో రెండు, మూడు చోట్ల మినహా మిగిలిన చోట్ల గెలిచే అవకాశాలు లేకపోవడంతో పోటీకి అభ్యర్థులు ముందుకు రావడం లేదు. మరోవైపు ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుంచి ఈ నెల 12వ తేదీన పూరించాలని కేసీఆర్ నిర్ణయించారు.  ఉద్యమకాలం నుంచి సెంటిమెంట్ గా కలిసివస్తన్న కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్‌  కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థిత్వాల విషయమై కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల ముఖ్య నేతలతో ఆయన నిన్న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు.


ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమేనంటున్న కేసీఆర్... శాసనసభ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దని, అధైర్య పడవద్దని నేతలు, కార్యకర్తలకు దైర్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చేలా నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని కేసీఆర్ సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో భారాస ఖచ్చితంగా గెలువబోతోందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో తాను రోడ్ షోలలో పాల్గొంటానన్నారు కేసీఆర్.


మరింత సమాచారం తెలుసుకోండి: