తెలంగాణ విద్యావ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి తనదైన ముద్ర కోసం తాపత్రయ పడుతున్నారు. గతంలో కేసీఆర్‌ తీసుకొచ్చిన గురుకుల విద్యావ్యవస్థ విస్తరణ ప్రజల నుంచి మంచి మార్కులు సంపాదించింది. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షకు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు హాజరయ్యారు. ప్రతీ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు  ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్కిటెక్చర్స్ రూపొందించిన పలు నమూనాలను పరిశీలించిన సీఎం, డిప్యూటీ సీఎం... ఒకే చోట ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఓబీసీ, మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని కోసం పైలట్ ప్రాజెక్ట్ గా కొడంగల్, మధిర నియోజవర్గాల్లో ఈఇ గురుకులాలు ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో 20ఎకరాలు చొప్పున ప్రభుత్వం సేకరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: