ఈ ఏడాది భారతదేశ టెలికాం రంగం ఎన్నో ఒడిదుడుకులను చదడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం మధ్యాహ్నం టెలికాం రంగంలో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. ఇందులో ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జీలు ముఖ్యంగా చెప్పుకోతగ్గవి. అసలు ఈ గొడవ మొత్తం రింగ్ టైమ్ తగ్గించడం దగ్గర మొదలైంది. ఆ తర్వాత మెల్లగా అనేక మలుపులు జరిగాయి. ఈ పరిణామాలతో జియో ఇతర నెట్ వర్క్ లకు చేసుకునే కాల్స్ కు నిమిషానికి 6 పైసల ఐయూసీ చార్జీలను విధిస్తున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించింది.
అయితే ఊహించినట్లుగానే దీనికి వినియోగదారుల నుంచి కాస్త వ్యతిరేకత ఎదురైంది. అంతే కాకుండా ఈ ఐయూసీ చార్జీలు ఎప్పటికి ముగుస్తాయనే ఒక ప్రశ్న కూడా వినియోగదారుల్లో మొదలైంది. ఇప్పుడు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) దీనికి సంబంధించిన మరో విషయాన్ని ప్రకటన చేసింది. దీనితో కనీసం మరో సంవత్సరం పాటు ఈ ఐయూసీ చార్జీలు అమల్లోనే ఉంటాయన్న విషయం ఇప్పుడు స్పష్టమైంది.
మొదట్లో ఈ సంవత్సరం ఆఖరి నుంచి ఐయూసీ చార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ట్రాయ్, ఇప్పుడు మళ్లీ దాన్ని మరో సంవత్సరం పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీనితో జీరో ఐయూసీ చార్జీలు జనవరి 2021 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టమైంది. దీనితో జియో వినియోగదారులు మరో సంవత్సరం పాటు ఈ ఐయూసీ చార్జీలను చెల్లించక మానక తప్పదు.
ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ వినియోగదారుల నుంచి ఐయూసీ చార్జీలను అసలు వసూలు చేయడం లేదు. కాబట్టి వారి వినియోగదారులు తాము ఎంచుకునే ప్లాన్లను బట్టి అన్ లిమిటెడ్ ఉచిత కాలింగ్ ను వారు ఎంజాయ్ చేయవచ్చు. టారిఫ్ లను సవరించిన అనంతరం జియో ప్లాన్లు మిగతా వాటి కంటే కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ అత్యంత కీలకమైన కాల్స్ విషయంలో మాత్రం జియో అన్ లిమిటెడ్ ను అందించకపోవడంతో కాస్త వెనుకబడింది.
ప్రభుత్వం ఎప్పుడైతే ఐయూసీ చార్జీలను నిలిపివేస్తుందో, అప్పుడే తాను కూడా ఐయూసీ చార్జీలను సేకరించడం ఆపేస్తానని జియో ఇప్పటికే ప్రకటిన చేసింది. ట్రాయ్ ఇంతకముందు తెలిపిన దాని ప్రకారం ఈ సంవత్సరం చివరికే ఈ చార్జీలను నిలిపివేయాల్సి ఉండగా, ఇప్పుడు దీన్ని మరో సంవత్సరం వరకు పొడిగించింది. కాబట్టి జియో వినియోగదారులు కూడా మరో సంవత్సరం పాటు ఈ చార్జీలను చెల్లిచ్చాల్సిందే .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి