కేంద్ర ప్రభుత్వం కరోనా వల్ల వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాళ్లపై ప్రధానంగా దృష్టి పెట్టి కొత్త పథకాలను అమలులోకి తెస్తోంది. కేంద్రం వర్కర్లు, కూలీలు, వలస కార్మికులకు ప్రయోజనం కలిగేలా కీలక నిర్ణయం తీసుకుంది. వీళ్ల కోసం త్వరలోనే రెంటల్ హౌసింగ్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వలస కార్మికులతో పాటు ఉద్యోగులు కూడా ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. 
 
వలస కార్మికులతో పాటు ఉద్యోగులు కూడా ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ రెంటల్ హౌసింగ్ స్కీమ్ వల్ల తక్కువ అద్దెకే ఇళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇంటి అద్దె రూ.1,000 నుంచి ప్రారంభం కానుండగా గరిష్టంగా 3000 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. తొలి విడత కింద రూ.700 కోట్ల రూపాయలను హౌసింగ్ మినిస్ట్రీ కేటాయించింది. 
 
మే 14వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ స్కీమ్ కు సంబంధించిన ప్రకటన చేశారు. రూరల్ రెంట్ స్కీమ్‌కు సంబంధించి కేబినెట్ నోట్ రెడీ కాగా దీనికి హౌసింగ్ మినిస్ట్రీ ఆమోదం కూడా తెలిపింది. ఈ స్కీమ్ కింద ఇళ్లు నిర్మించే కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం పలు రాయితీలను అందించనుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రెంటల్ హౌసింగ్ స్కీమ్ కింద పీపీపీ మోడల్ లో ఇళ్లను నిర్మించనుందని తెలుస్తోంది. 
 
వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ఈ ప్రాజెక్ట్ ను తయారు చేయొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. తొలి దశలో దేశవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో 75,000 వరకు ఇళ్లను కేంద్రం నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేంద్రం తీసుకురాబోతున్న ఈ స్కీమ్ పట్ల వలస కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.               

మరింత సమాచారం తెలుసుకోండి: