మనిషి కంప్యూటర్ యుగం నుండి అంతరిక్షంలోకి దూసుకుపోతున్నా రోజులు ఇవి. అయినా మనిషి మూఢనమ్మకాలను మాత్రం జయించలేకపోతున్నాడు. శాస్త్రం కంటే మంత్రతంత్రాల మీదే నమ్మకం ఎక్కువగా ఉంటుంది చాలా మందికి. అందుకే మన దగ్గర శాస్త్రవేత్తల కన్నా బాబాలు, స్వామీజీలకు ఆదరణ, గుర్తింపు ఎక్కువ. శాంతి చేస్తాం.. దెయ్యాలను వదిలిస్తామంటూ జనాల దగ్గర డబ్బులు గుంజే వారికి కొదవే లేదు.