అవునూ.. మీరు విన్నది నేను అన్నది నిజమే. ఓ మూడేళ్ల బాలికను అత్యాచారం చేసి ఆపై
హత్య చేసిన ఘటన ఇప్పుడు అందరి హృదయాలను కలచివేస్తుంది. అయితే అసలు ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? ఎపుడు జరిగింది? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. ఈ హృదయ విదారకరమైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరి జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ పాప బుధవారం నాడు అదృశ్యమైనట్టు తెలుస్తోంది. అయితే ఆమె తల్లిదండ్రులు బాలిక ఆచూకీ కోసం గాలించారు.. అయినా జాడ కనిపించలేదు. అయితే గురువారం ఉదయం గ్రామానికి అర కిలోమీటర్ దూరంలో బిడ్డ మృతదేహం దొరికింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. అయితే బాలికపై అత్యాచారం చేసి,
హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడి అయినట్లు పోలీసులు తెలిపారు.
.jpeg)
ఇదిలా ఉంటే.. పాతకక్షల కారణంగానే తన బిడ్డను కిడ్నాప్ చేసి ఈ దారుణానికి పాల్పడ్డారని మృతురాలి
తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. లఖింపూర్‌ఖేరీ జిల్లాలో గత 20 రోజుల్లో ఈ అత్యాచార ఘటన మూడోది. ఇప్పటికే ఓ 17 ఏళ్ల యువతి స్కాలర్‌షిప్ దరఖాస్తు కోసం వెళ్లగా, ఆమెపై కొందరు దుండగులు అత్యాచారం చేసి చంపేశారు. మరో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపారు. ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరుస దారుణాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని శిక్షలు అమలు చేసినా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూన ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.