ప్రేమించి పెళ్ళి చేసుకున్న చాలా మంది కొంతకాలానికే భార్యను కట్నం తీసుకురాలెదని వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించానని వెంటపడి మరీ వెధించి పెళ్ళి వరకూ తీసుకెల్లాడు. చేసుకొని తన ఇంటికి తీసుకెల్లాడు. అయితే అంతవరకూ అంతా బాగానే వుంది. వారి కాపురం సజావుగా సాగింది. వారిద్దరికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఆ తర్వాత నుంచి ఆమెకు వెధింపులకు గురి చేశాడు. ప్రతిదీ తల్లి చెప్పినట్లు వినాలని డిమాండ్ చేసేవాడు.. దారునంగా కొట్టేవాడు. ఎప్పటికప్పుడు తనకూ తానూ సర్ది చెప్పుకుంటూ అలానే గడిపేది.


ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లిచేసుకున్న వాడి చేతిలోనే మోసపోయిన బాధిత మహిళ అత్తింటి ఎదుట మౌన దీక్షకు దిగింది.. ఈ అమానుష ఘటన ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లొకి వెళితే.. కృష్ణా జిల్లా అవనిగడ్డ కు చెందిన మణికంఠ వైష్ణవి అనే యువతిని కొన్నే ఏళ్ళుగా ప్రెమించుకున్నారు. ఇంట్లో పెద్దలు వారి పెళ్ళికి ఒప్పుకోలేదు. అయినా ఇద్దరు కలిసి గత ఏడాది లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత మణికంఠ అసలు రూపాన్ని బైటపెట్టాడు. నిత్యం వేధింపులకు దిగుతున్నా పుట్టింటికి వెళ్లలేక మౌనంగా భరిస్తూ వస్తుంది.


ఈ క్రమంలో వాళ్ళకు కవల పిల్లలు పుట్టారు. అప్పుడు అన్నా తనలో మార్పు వస్తుందేమో అని ఆమె ఆశపడింది. కానీ అక్కడ కూడా మార్పు లేకపోవడం వల్ల ఆమె నిరాశకు గురి చేస్తూవస్తున్నాడు. అదిభరించలెని ఆమె కొద్ది రోజులు క్రితం ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆమెను రక్షించిన బంధువులు తమవెంట తీసుకునివెళ్లారు. అక్కడ కోలుకున్న ఆమె తిరిగి అత్తారింటికి వెళ్ళింది. వాళ్ళు ఇంట్లోకి రానివ్వక పోవడంతో షాక్ గురైంది. దాంతో అక్కడ అత్తింటి ఎదుట దీక్షకు దిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకి వచ్చి కేసు నమోదు చేసుకొని వివరాలను సెకరించె పనిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: