ప్రస్తుతం నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీస్ అధికారులు చెబుతున్నారు.. అది నిజమే.. సైన్స్ పెరిగే కొద్దీ నేరాలు చేసెందుకు కొత్త మార్గాలను కూడా కేటుగాల్లు ఎంచుకుంటున్నారు.. ఈ మధ్య ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇలాంటి కేసులను ఒక కొలిక్కి తీసుకురావాలని పోలీసులు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఒక విచిత్రమైన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది..కొన్ని ముఠాలు పెళ్లికాని అబ్బాయిలను టార్గెట్ చేస్తూ.. చాలా తెలివిగా మోసాలు చేయడం చూస్తూనే ఉన్నాము.


విషయానికొస్తె.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ ముఠా చేసిన నేరాలు పోలీసు అధికారులకె మతి పోయేలా చేస్తున్నాయి. వయసు పైబడి, పెళ్లి కాకుండా ఉన్న అధికారులు కూడా వీరి వలలో చిక్కుకున్నారు. 15 నుంచి 19 ఏళ్లలోపు బాలికలు, యువతులతో ఫోన్లో మాట్లాడించి వారిని బుట్టలో వేసుకొని అందిన కాడికి డబ్బులను గుంజుతున్నారు. మ్యాట్రిమోనీ సైట్లు, కాల్ సెంటర్ల ద్వారా మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 25 మొబైళ్లు, 40 సిమ్‌కార్డులు, మూడు కంప్యూటర్లను స్వాదీనం చేసుకున్నారు..


మొదట రిజిస్ట్రేషన్ అని 5 నుంచి 10 వేల వరకూ రాబడుతున్నారు. వీళ్ళు ఒక ప్రాంతంలోనే కాకుండా అనేక ప్రాంతాలలొ మోసాలను చెస్తున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఒడిశా, బీహార్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఇలా కొన్ని రాష్ట్రాలలో వీరి ఇలాంటి దారునాలు చేస్తున్నారు. 35 నుంచి 45 ఏళ్ళ లోపు వయస్సు ఉన్న  వాళ్ళు 1400 ల మంది వీళ్ళ వలకు చిక్కుకున్నారు. టెక్నాలజీ తోనే పని కానిస్తున్నారు. ఫొటోలను సేకరించి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారని చెప్పి మోసం చేస్తున్నారు.. మొదట డబ్బులు గుంజి తర్వాత అడ్రెస్ మారుస్తున్నారు.. వీరి ముఠాను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: