దొంగలు కూడా ఇలాంటి లైఫ్ ను ఎంజాయ్ చేస్తారా..వామ్మో విఐపికి లేని లగ్జరి లైప్ ను పొందుతున్నారు. కాస్త ఎక్కువగా దొంగతనాలు చేస్తున్న వాళ్ళ రేంజ్ వేరే లెవల్ అని చెప్పాలి.. అలా ఓ దొంగ ఇంటర్నేషనల్ దొంగతనాలు చేస్తున్నాడు. విమానం వచ్చి దర్జాగా కార్లను దొంగతనం చేసుకొని వెళ్ళేటప్పుడు కారులో వెళుతూ వాటిని అమ్ముకొని కోట్లు సంపాదిస్తున్నారు.. అతని ఆదాయం సినీ నటుడుకు కూడా ఉండదని చెప్పాలి.అలాంటి ఈ దొంగ బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తాడు..హైదరాబాద్‌లో నెలకు 5 లేదా 6 కార్లను దొంగతనం చేసుకొని వెళ్లిపోతాడు.కార్లు చొరికి గురైన కేసులు పోలీసులకు టార్గెట్ గా మారాయి.


మొత్తానికి పోలీసులకు ఈ దొంగ చిక్కాడు.దాంతో ఈ విషయం బయటకు వచ్చింది..అంతర్రాష్ట్ర కార్ల దొంగ సత్యేంద్రసింగ్‌ షెకావత్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు ఇక్కడ జరిగిన ఓ కారు దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్నారు.ఈ విచారణ లో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి..పార్క్‌హయాత్‌ హోటల్‌లో కన్నడ నిర్మాత మేఘనాథ్‌ ఫార్చునర్‌ కారును దొంగిలించి పరారయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే దుండిగల్‌పోలీ స్‌ స్టేషన్‌ పరిధిలో ఒకటి, నాచా రం పీఎస్‌ పరిధిలో ఒక కారు, పేట్‌బషీరాబాద్‌ పరిధిలో రెండు కార్లు చోరీ చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఏడాది వ్యవధిలోనే బెంగళూరు, చెన్నై, గుజరాత్, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో దొంగతనాలు చేస్తూ వస్తున్నాడు..


ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన డివైస్‌ను ఉపయోగించి కారు డోర్‌లు తెరుస్తూ కేబుల్‌ కనెక్ట్‌ చేసి ఎంచక్కా వాటిలో దూసుకెళ్లేవాడు. దొంగిలించిన కార్లను తక్కువ ధరకు అమ్మేస్తూ జల్సా చేసేవాడు. పార్క్‌హయత్‌లో కారు దొంగతనం చేసేందుకు అతను విమానంలో వచ్చాడు. అలాగే పేట్‌బషీరాబాద్‌లో కార్ల చోరీ సమయంలోనూ విమానంలోనే వచ్చిన షెకావత్‌ తర్వాత కార్లను దొంగతనం చేసి వాటిలో వెళ్ళే వాడు.. ఇలా హైదరాబాద్‌లో అయిదు దొంగతనాలు చేసినట్లు బంజారాహిల్స్‌ పోలీసుల విచారణలో రుజువైంది.ఇలా ఒకటేమిటి 61 కార్లను దొంగతనం చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: