ఇటీవలి కాలంలో ఎక్కడ చూసిన దొంగల బెడద కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది దొంగతనాలు కు వచ్చి ఇక విలువైన వస్తువులు నగలు నగదు లాంటివి అందినకాడికి దోచుకోవడమే కాదు కాస్త చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న ఒక ఫైనాన్స్ కంపెనీలో చోరీ చేసేందుకు వెళ్లిన దొంగలు అక్కడ పూజలు నిర్వహించి డోంట్ ఫాలో మీ ఐ యామ్ డేంజరస్ అంటూ ఒక లెటర్ రాసి వెళ్లడం హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. మరికొన్ని చోట్ల దొంగతనానికి వెళ్లి హాయిగా కిచెన్లో ఏదో ఒక వంటకం చేసుకొని తినడం లాంటివి కూడా చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఒక ఇంట్లో చోరీ చేయడానికి వచ్చిన దొంగలు ప్లాన్ ప్రకారమే అందినకాడికి దోచుకున్నారు. దాదాపు 20 లక్షల రూపాయలు కాజేశారు. కానీ వెళుతూ వెళుతూ ఒక చిలిపి పని చేసి వెళ్లిపోయారు అనే చెప్పాలి. ఏకంగా ఇంటి యజమానికి ఐ లవ్ యూ అంటూ ఒక పేపర్ మీద రాసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన గోవాలో వెలుగులోకి వచ్చింది. మార్గో లోని ఓ ఇంట్లో చొరబడిన దొంగలు చేసిన పనికి యజమాని అవాక్కయ్యాడు అని చెప్పాలి. ఆసిఫ్ జెక్ అనే వ్యక్తి హాలిడే ట్రిప్ కి ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు. ఇటీవల ఈ హాలిడే ట్రిప్ ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ఊహించని షాక్ తగిలింది. వేసిన తలుపులు వేసి నట్లు గానే ఉన్నాయి. కానీ ఇంట్లో చొరబడి దొంగలు అందినకాడికి దోచుకో పోయారు. 20 లక్షల విలువైన బంగారు నగలతో పాటు 1.5 లక్షల నగదు కూడా పోయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంతలోనే యజమాని కి మరో షాక్ తగిలింది. ఏకంగా ఆ ఇంట్లో ఉన్న టివి స్క్రీన్ పై ఐలవ్యూ అని రాసి ఉండటం గమనార్హం. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇక అక్కడ పలు ఆధారాలను సేకరించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: