ఇటీవల కాలంలో ఎంతోమంది ఇక తమ ఇంట్లో పెంపుడు కుక్కలను పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తమకు నచ్చిన బ్రీడ్ తెచ్చుకొని ఇక ఇంట్లో ప్రేమగా పెంచుకుంటూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.  ఇక ఇలాంటివి చూసినప్పుడు మనిషికి కుక్కలకి మధ్య బంధం మరింత బలపడింది అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే కొంతమంది మాత్రం పెంపుడు కుక్కలను ప్రేమగా పెంచుకోవడం కాదు వాటిపట్ల కర్కశంగా ప్రవర్తిస్తూ హింసించడం లాంటి వీడియోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి.


 ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఈ కోవలోకి చెందినది అని చెప్పాలి. ఏకంగా పెంపుడు కుక్క దాడి చేస్తుందని కోపంతో ఊగిపోయిన యజమాని.. దానిని హతమార్చి చెరువులో పడేయాలని భావించింది. ఈ క్రమంలోనే అనూహ్య   ఘటనతో చివరికి అతనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. రూబీ  అనే మహిళ భర్త ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తుంది.. అయితే వారు ఒక పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. ఇటీవల రూబీ పై పెంపుడు కుక్క దాడి చేసింది. గతంలో కూడా ఇక యజమాని పిల్లలపై పెంపుడు కుక్క దాడి చేయడం గమనార్హం. దీంతో ఇక రూబి ఆ కుక్కను చంపేసింది. కుక్క మృతదేహాన్ని చెరువులో పడేసేందుకు వెళ్ళింది.


 తన భార్య రూబీ చెరువు వద్దకు వెళ్లి ఎంతకు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి అక్కడికి వెళ్లి చూడగా రూబీ చెప్పులు మాత్రమే కనిపించాయి. ఆమెను కనిపించలేదు. దీంతో చెరువులో పడిపోయిందేమో అనే భయంతో గ్రామస్తులు సహాయం కోరగా.. వారు చెరువులో గాలించి రూబీ మృతదేహాన్ని బయటకు తీసారు. ఇక పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. కుక్క కారణంగా ఇక తమ కుటుంబంలో ఒకరు చనిపోయారు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక అందరూ బోరున విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: