ఇటీవల కాలంలో కుక్కలను పెంచుకోవడం అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్రెండును ఫాలో అవ్వడానికి ఎంతో మంది తెగ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. భారీ ధర పెట్టి ఏకంగా మంచి బ్రీడ్  కుక్కలను కొనుగోలు చేసి ఇక ఇంట్లోకి తెచ్చుకుంటున్నారు. ఇంట్లోకి తెచ్చిన తర్వాత ఏకంగా ఇంట్లో మనుషుల్లాగానే వాటిని చూసుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. కొంతమంది అయితే మనుషుల మీద చూపించిన ప్రేమ కంటే కుక్కల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.


 ఇలా కుక్కలకి మనుషులకి మధ్య ఒక బలమైన బంధం ఏర్పడుతున్న తరుణంలో.. మరోవైపు వీధి కుక్కలు మాత్రం రెచ్చిపోతూ ఉండడం అందరిని భయాందోళనకు గురి చేస్తూ ఉంది అని చెప్పాలి. ఎక్కడకైనా వెళ్తున్నప్పుడు వీధి కుక్కలు రోడ్డుపై కనిపించాయి అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే వీధి కుక్కలు ఆ రేంజ్ లో దాడులకు పాల్పడుతూ ఉన్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా చిన్నపిల్లలను టార్గెట్ చేసుకుంటూన్న వీధి కుక్కలు  మరింత రెచ్చిపోతూ దాడులకు దిగుతూ ఉన్నాయి. అయితే వీధి కుక్కలు ఎంత దారుణంగా దాడి చేస్తున్నాయో అన్నదానికి సంబంధించిన వీడియోలు అట సోషల్ మీడియాలో కూడా వెలుగులోకి వస్తున్నాయి.


 అయితే ఇటీవల కాలంలో వీధి కుక్కల దాడులకు సంబంధించిన ఘటనలు తగ్గాయి అని అనుకుంటున్న సమయంలో.. ఇక్కడ మరోసారి వీధి కుక్కల గుంపు ఒక చిన్నారిపై దారుణంగా దాడి చేశారు. తమిళనాడులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే చిన్నారి స్కూల్ నుంచి వస్తుంది. ఈ క్రమంలోనే  ఒక వీధి కుక్క ఇక దాడి చేసేందుకు ప్రయత్నించింది. అంతలోనే మరికొన్ని వీధి కుక్కలు కూడా వచ్చి చిన్నారిపై దాడి చేయడం మొదలుపెట్టాయి.  హోసూరులో ఘటన వెలుగు చూసిం.ది అయితే చిన్నారి అరుపులు విన్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఇక వీధి కుక్కలను తరిమికొట్టి చిన్నారి ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటనలో గాయపడిన చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: