
దీంతో పోలీసులు నిర్లక్ష్యంగా ఉండడం చూస్తున్న ఎంతోమంది నేరస్తులు తప్పించుకొని పారిపోవడం లాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఏకంగా రోడ్డు మధ్యలో పోలీసులు టీ తాగడానికి ఆపారు. కానీ ఇక తాము పోలీస్ స్టేషన్కు తీసుకు వెళుతున్న దొంగలు పారిపోతారు అన్న ఆలోచన మాత్రం చేయలేదు. దీంతో పోలీసుల అప్రమత్తంగా లేరు అన్న విషయాన్ని గమనించి దొంగలు చివరికి వ్యాన్ దిగి పరారయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో దొంగలు ఇలా పోలీసులకు చుక్కలు చూపించారు. టీ తాగుదామని బండి దిగి పోలీసులు ఏమనుపాటుగా వ్యవహరించడంతో. ముగ్గురు దొంగలు కూడా కస్టడి నుంచి తప్పించుకొని పారిపోయారు. అయితే ముగ్గురూ దొంగలతో పోలీసులు కోర్టుకు వ్యాన్ లో వెళ్తున్నారు. మార్గమధ్యమంలో పోలీసులు టీ కోసం వ్యాన్ అప్పారు. ఆ సమయంలో వాహనం తలుపులు లాక్ చేయడం మర్చిపోయారు. దీంతో ఇదే అదునుగా భావించిన దొంగలు పోలీసులు ఏమరుపాటుగా ఉన్నారు అని గమనించి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు అని చెప్పాలి.