రెండున్నరేళ్లు ముగిశాక బీజేపీ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా తానే సీఎం అవుతానని బీజేపీకి మద్దతు ఉపసంహరించారు. తదనంతరం జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకపక్షంగా గెలిచి అధికారాన్ని దక్కించుకుంది. దీంతో ప్రస్తుతం జరిగిన ఎన్డీఏ మిత్రపక్షాల మీటింగ్ కు జేడీఎస్ కు ఆహ్వానం పంపలేదు. అకాలీదళ్ తో సుధీర్ఘ కాలం పాటు బీజేపీ స్నేహ సంబంధాలే కొనసాగించింది. కానీ కేంద్రంలో తీసుకొచ్చిన రైతు చట్టాలను అకాలీదల్ మొదట వ్యతిరేకించి తర్వాత కేంద్ర మంత్రి పదవిలో నుంచి వైదొలగడం, బీజేపీకి దూరం అయింది.
కానీ ప్రస్తుతం బీజేపీ ఎన్డీఏ మిత్రపక్షాల మీటింగ్ కు ఆహ్వానం పంపలేదు. ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆ రెండు సార్లు బీజేపీనే బూచిగా చూపించి తర్వాత ఎన్నికలకు చంద్రబాబు వెళ్లారు. ఆ రెండు సార్లు కూడా ఓటమి పాలయ్యారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీని బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకులు చేయనంత స్ట్రాంగ్ గా విమర్శలు చేశారు. దాదాపు మోదీపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. కేవలం బీజేపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ది చేయలేకపోతుందని నెపాన్ని బీజేపీపై తోసేశారు.
దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా గెలవవచ్చని అనుకున్నారు. కానీ చంద్రబాబు చెబుతున్న విషయాన్ని ప్రజలు గ్రహించి సీఎంగా వైసీపీ అధినేత జగన్ ను గెలిపించారు. అయితే చంద్రబాబు బీజేపీతో కలవాలని ఆసక్తి కనబరుస్తున్న బీజేపీ అధిష్టానం మాత్రం ఆయన్ని పక్కన పెట్టిసేంది. ఎన్డీఏ సమావేశాలకు టీడీపీకి ఆహ్వానం అందలేదు. దీంతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ దూరమై టీడీపీ ఒంటరైపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి