రాజకీయ నాయకులకు ఎలక్షన్లలో ఓడిపోయినప్పుడు మాత్రమే కాదు, తాము అరెస్టు అయినప్పుడు కూడా  ఒకరకంగా  వారికి ఓటమి భావనే వస్తుంది.  గతంలో జగన్ అవినీతి కేసులో అరెస్ట్ అయినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఎంపీ మాత్రమే. అది కూడా ఆయన బయటకు వచ్చాక ఒక సొంత పార్టీని పెట్టుకోవడం, దానిని ముందుకు తీసుకు వెళ్లడం జరిగింది.


ఇప్పుడంటే ఆయనకి రాజకీయంగా బలమైన ఫౌండేషన్ ఉంది. కానీ అప్పటి పరిస్థితి వేరు. కానీ చంద్రబాబు నాయుడు విషయం అలా కాదు. గ్రౌండ్ లెవెల్ లో తెలుగుదేశం పార్టీ మంచి బలమైన పార్టీ. ఆంధ్ర రాష్ట్రంలో బలంగా వేళ్ళు అనుకున్న తెలుగుదేశం పార్టీకి అధినేత ఆయన. అందుకే ఆయనకు నలువైపుల నుండి బలమైన మద్దతు అనేది లభిస్తుంది ఇప్పుడు. ఒకవేళ కోర్టులో చంద్రబాబు నాయుడి కేసు కొట్టేసి ఉంటే గనుక వైఎస్సార్సీపీ వాళ్ళని టిడిపి శ్రేణులు ఫుట్ బాల్  ఆడుకునే వారిని తెలుస్తుంది.


తాజాగా హైకోర్టులో చంద్రబాబు నాయుడుకి బెయిలు గాని వస్తే పరిస్థితి ఒకలా ఉండేది. రాకపోతే మరోలా ఉండేది. ఒకవేళ చంద్రబాబు నాయుడు కి బెయిల్ వస్తే సోషల్ మీడియాలో వైఎస్ఆర్సిపి శ్రేణులు ఆవతలి వైపు న్యాయవాదులను కులాల పరంగా  విమర్శించేవారని అంటున్నారు కొంత మంది. అయితే ఈ చంద్రబాబు నాయుడు కేసు విషయంలో గతంలో చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా వాదించిన ఒక న్యాయవాదే న్యాయమూర్తిగా వాదనలు వినడం  గమనార్హం.


ఒకవేళ  హైకోర్టులో చంద్రబాబు నాయుడుకి బెయిల్ కానీ వస్తే వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఆ కేసును వాదించిన న్యాయవాదులను కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టేవారు. కానీ బెయిల్ రాలేదు కాబట్టి ఆ వాతావరణం లేదు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు కేసు విషయంలో ఆయనకి బెయిల్ వచ్చినా కూడా  వైసిపి సోషల్ మీడియా వర్గాల వారు హుందాగా కామెంట్లు పెట్టాలని ముందుగానే అధిష్టానం చెప్పడం జరిగిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: