రాజకీయాల్లో ఏదైనా జ‌రగొచ్చు. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో కూడా చెప్ప‌లేం. ఇప్పుడు ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి ఆక‌స్మికంగా ఏపీ రాజ‌కీయ తెర‌మీద‌కి వ‌చ్చింది. అదే గుంటూరు జిల్లా రేపల్లె నియోజ‌క‌వ‌ర్గం. ఇది టీడీపీకి కంచుకోట‌గా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో నూ.. అంత‌కు ముందుకూడా గౌడ సామాజిక వ‌ర్గానికి చెందిన అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌.. ఇక్క‌డ వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకు న్నారు వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీలో టీడీపీ నేత‌లు ఘోరంగా ఓడిపోయినా.. గెలిచిన 23 స్థానాల్లో రేప‌ల్లె కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఇక్క‌డ అన‌గానికి తిరుగులేద‌నే టాక్ ఉంది. పార్టీ త‌ర‌ఫున మంచి వాయిస్ వినిపిస్తున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు కూడా తీరుస్తున్నారు.

ఇక‌, వైసీపీ ప‌రంగా చూసుకుంటే.. దివంగ‌త వైఎస్‌కు అత్యంత విశ్వ‌స‌నీయుడిగా పేరున్న మాజీ మంత్రి మోపిదేవి వెంక‌ట‌రమ‌ణ ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయిన‌ప్ప‌టికీ.. సీఎం జ‌గ‌న్ ఆయ‌న‌ను ఎమ్మెల్సీని చేసి.. మంత్రి వ‌ర్గంలో కి తీసుకున్నారు. అంటే.. మోపిదేవికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నార‌నేది సుస్ప‌ష్టం. ఇక‌, త‌ర్వాత‌.. ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపిం చారు. దీంతో ఇప్పుడు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రేప‌ల్లెలో వైసీపీ త‌ర‌ఫున ఎవ‌రిని పోటీకి పెడ‌తారు? అనే చ‌ర్చ నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా.. పార్టీవ‌ర్గాల్లోనూ జ‌రుగుతోంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల మేర‌కు మ‌ళ్లీ మోపిదేవికే టికెట్ ఇస్తార‌ని.. అంటున్నారు.

అయితే.. మోపిదేవి కుటుంబం నుంచి ఆయ‌న కుమారుడు రాజీవ్ రంగంలోకి వ‌చ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తానే పోటీ చేస్తాన‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న జోరుగా ప్ర‌చారం కూడా చేసుకుంటున్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను, సంక్షేమ కార్య‌క్ర‌మాల ను కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. పార్టీ శ్రేణుల‌కు కూడా ట‌చ్‌లో ఉంటున్నారు. అయితే.. ఇంత‌లోనే.. మ‌రో పేరు ఆక‌స్మికంగా చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. అదేహీరో.. సుమ‌న్‌. తెలుగు సినీ రంగంలోనే కాకుండా.. ఇత‌ర భాషా సినిమాల్లోనూ న‌టించి పేరు తెచ్చుకున్న సుమన్ కూడా గౌడ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తే. పైగా.. రాజ‌కీయాల్లోనూ ఆయ‌న కొన‌సాగారు. గ‌తంలో అన్న‌గారి హ‌యాంలో టీడీపీకి అనుకూలంగా ప‌నిచేశారు. త‌ర్వాత‌.. చంద్ర‌బాబుకు అనుకూలంగా ప‌నిచేశారు.

2014 ఎన్నిక‌ల్లో టీడీపీకి ప‌రోక్షంగా ఆయ‌న ప‌నిచేశారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకుంటార‌ని అంటున్నారు. ఆయ‌న‌ను రేప‌ల్లెలో నిలబెట్టాల‌ని.. పార్టీ అధిష్టానం కూడా చూస్తోంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే సుమ‌న్ పేరు ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. దీనికి సుమన్ సిద్ధ‌మేనా.. నిజంగానే ఆయ‌న ఇక్క‌డ‌కు వ‌చ్చి పోటీ చేస్తారా? అనేది చూడాలి. ఎందుకంటే.. ఈ సీటు వైసీపీకి అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా మారింది ఎందుకంటే.. ఇక్క‌డి ఎమ్మెల్యే అన‌గాని .. పార్టీ మారాల‌ని ఒత్తిడి వ‌చ్చినా.. మార‌లేదు. పైగా.. ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈయ‌న‌ను ఓడించాల‌నేది వైసీపీ ప‌ట్టుద‌ల‌. ఈ క్ర‌మంలో సుమ‌న్ పేరు ప్ర‌ముఖంగా వినిపించడం గ‌మ‌నార్హం. అయితే.. దీనికి మోపిదేవి ఒప్పుకొంటారా? అనేది కూడా ప్ర‌శ్న‌గా మారింది. ఎందుకంటే.. ఆయ‌న రాజ్య‌స‌భ‌కు వెళ్లినా.. ఆయ‌న కుమారుడు రాజీవ్ ఎలానూ ఉన్నారు. సో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న వార‌సుడిని రంగంలోకి దింపాల‌ని మోపిదేవి చూస్తున్నారు. ఈ క్ర‌మంలో.. ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: