
మూడు రాజధానులకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. తగిన సమయంలో శాసనసభలో బిల్లు ప్రవేశపెడతామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా తాజాగా ధ్రువీకరించారు. ఆషామాషిగా కాకుండా పకడ్బందీగా మూడు రాజధానుల చట్టం తెస్తామని సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. మూడు రాజధానుల పై పకడ్బందీగా చట్టం తీసుకువస్తామని గతంలో చట్టాన్ని వెనక్కి తీసుకున్న సమయంలోనే స్పష్టం చేశామని సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
న్యాయప్రక్రియకు లోబడే ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం తీసుకువస్తుందని సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. రాజధానిపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. రాజధాని సంబంధించి ప్రభుత్వం, వైకాపా స్టాండ్ కు తగ్గట్టుగానే సుప్రీంకోర్టు నిర్ణయం ఉందని భావిస్తున్నట్లు సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు.
ఇవాల్టికీ రాష్ట్ర రాజధాని అమరావతే నన్న సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.. భవిష్యత్తులో అమరావతి శాసన రాజధానిగానే ఉంటుందని తేల్చి చెప్పారు. అమరావతి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. వివేకా హత్య కేసులో న్యాయం జరగాలని వైఎస్ జగన్ కుటుంబం, వైకాపా కోరుకుంటుందన్న సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విచారణ ఇక్కడ జరిగినా.. ఎక్కడ జరిగినా మాకు అభ్యంతరం లేదన్నారు. తెలంగాణలో విచారణ జరిగినా మాకేమీ అభ్యంతరం చెప్పడం లేదని, ఎక్కడ దర్యాప్తు జరిగినా మంచిదేనని సజ్జల అన్నారు.