అక్రమిత కశ్మీర్ ప్రజలు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని తిట్టి పోస్తున్నారు. పాకిస్థాన్ లో జనాభా లెక్కలు జరుగుతున్నాయి. పీవోకే లో ఉన్నవారు గతంలో ఆజాదీ కాశ్మీర్ అని అనేవారు. మీరు పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి, లేక నాన్ పాక్ రెసిడెంట్ అని పాకిస్థాన్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. స్వతంత్ర కాశ్మీరులం అయితాం కానీ పాకిస్థాన్ వ్యక్తుల అని అడగడం ఏంటని పీవోకేలోని ప్రజలు పాక్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. మేం పాకిస్థాన్ వాళ్లము కాం.. మేం స్వతంత్ర కాశ్మీరులం అని అంటున్నారు. కాశ్మీర్ ప్రత్యేక దేశం కోసం పోరాటం చేశాం అని చెబతున్నారు.


అంజాబ్ అయూబ్ మీర్జా అనే పీవోకేలోని స్వతంత్ర కాశ్మీర్ ఉద్యమకారుడు పాకిస్థాన్ గవర్నమెంట్ పై నిప్పులు చెరిగాడు. పాకిస్థాన్ లో అంతర్భాగం కాశ్మీర్ కాదు. గిల్గిట్, బాలిస్తాన్ లో ఉద్యమాలు జరుగుతున్నాయి. కారణం పాకిస్థాన్ చేస్తున్న అతి వల్లే అని ఆయన అన్నారు. పాక్ అక్రమిత కాశ్మీర్ లో ఇలా చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదని ఆయన అన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకున్న ప్రజలు ఓప్పుకోరని అన్నారు.


పాక్ ప్రధానమంత్రి షాదాబ్ షరీప్ పీవోకేలోని ప్రజల మనస్తత్వం వారి అభిప్రాయాలు, వారి మనోగతం ఏంటన్నది అర్థం చేసుకుంటే మంచిదని అంటున్నారు. పీవోకేలో ఉన్న ప్రతి ఒక్కరు స్వతంత్ర కాశ్మీర్ కోసం పోరాటం చేశారని, ఇప్పటికి అదే మాటకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. అంతే కానీ దౌర్జన్యంగా మీరు పాకిస్థాన్ కు చెందిన వారా? లేక నాన్ రెసిడెంట్ అని అడగడం వింతగా ఉందని చెబుతున్నారు.


అయితే పాకిస్థాన్ లో పీవోకే తిరుగుబాటు మొదలైందని ఈ విషయం ద్వారా అర్థం అవుతుంది. ఇప్పటికే పాక్ లో ఆర్థిక సంక్షోభం ముదిరి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. తాలిబాన్ల తో సరిహద్దుల్లో ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఇలా పాకిస్థాన్ పూర్తిగా సంక్షోభంలోకి కూరుకుపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

POK