క‌రోనా మ‌హ‌మ్మారి మాన‌వాళికే కాదు..స‌మ‌స్త జీవ‌రాశికే ప్ర‌మాద‌కారిగా మారుతోంది. ముందు కేవ‌లం మ‌నుషుల‌కే ఈ వ్యాధి సోకుతుంద‌ని భావించిన శాస్త్ర‌వేత్త‌ల‌కు ఇప్పుడు అధ్య‌య‌నంలో..రోజుకు కొత్త విష‌యం తెలుస్తోంది. మొన్న‌టికి మొన్న పులుల్లో సైతం క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా శున‌కాల్లోనూ ల‌క్ష‌ణాలున్న‌ట్లు తేలింది. దీంతో ఇప్పుడు క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డం అన్న‌ది చాలా క‌ష్ట‌త‌ర‌మైన విష‌యంగా నిపుణులు చెబుతున్నారు. వ్యాధి వ్యాప్తి నియంత్ర‌ణ‌కు దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్ పేరుతో తలుపులు మూసేశాయి. ఎక్క‌డివాళ్లు అక్క‌డే..గ‌ప్‌చుప్‌గా ఇంట్లోనే దాక్కుంటున్నారు. 

ఇది ఎంత‌కాలం అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం లేదు. స‌మీప భ‌విష్య‌త్‌లో దీనికి మందు వ‌స్తుంద‌న్న ఆశా క‌ల‌గ‌డం లేదు. ఇక ప్ర‌పంచ వినాశానికి..అంతానికి కరోనానే కార‌ణ‌మ‌వుతుందా..? అన్న సందేహాలు ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌ను వేధిస్తోంది. అన్ని దేశాల ఆర్థిక వ్య‌వస్థ‌లు అత‌లాకుత‌లం అవుతున్నాయి. ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఆవిర‌వుతోంది. ఇప్ప‌టికే కొన్ని దేశాల్లో  లాక్‌డౌన్ ప‌ర్య‌వ‌సానంతో దోపిడీలు, దొంగ‌త‌నాలు మొద‌ల‌య్యాయి. ఆక‌లి చావులు ఆరంభ‌మ‌య్యాయి.  వైద్యో రామచంద్రా అని అభివృద్ధి చెందిన దేశాలు ఏడుస్తున్నాయి. మ‌మ్మ‌ల్ని కాపాడండి అంటూ పేద దేశాలు విల‌పిస్తున్నాయి.

 క‌రోనా ప్ర‌పంచంపై దాడి చేయ‌డం మొద‌లుపెట్టి కేవ‌లం మూడు నెల‌లే అవుతోంది. ఆల‌స్య‌మైన కొద్దీ ప్ర‌పంచం క్రిటిక‌ల్ స్టేజికి వెళ్తోంది. లాక్‌డౌన్‌ను క‌ట్టేసిన చైనాలో కొద్దిరోజుల్లోనే మ‌ళ్లీ క‌రోనా విజృంభిస్తోంది. దీన్ని బ‌ట్టి ఏం అర్థ‌మ‌వుతోంది. క‌రోనాకు అంతం లేదా అన్న ప్ర‌శ్న‌లు, భ‌యాలు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఏన్నాళ్లి బ‌తుకు...మందులేని మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయాలేక ప్ర‌పంచం స‌త‌మ‌త‌మ‌వుతోది.క‌రోనా మ‌న‌ల్ని అష్ట‌దిగ్బంధ‌నం చేసేస్తుంది. ఇంట్లో ఉండే ఎన్నాళ్లు క‌రోనాను క‌ట్ట‌డి చేస్తాం.  ప్ర‌పంచ‌మంతా ప్యానిక్‌లోకి వెళ్లిపోతోంది. జ‌నాల్లో నిర్వేదం..నిస్సహాయ‌త అవ‌హిచింది. చేతులు క‌ట్టుకుని కూర్చోవ‌డం త‌ప్పా..క‌రోనా త‌రుముంటే ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బ‌తికేయ‌డం త‌ప్పా ఏం చేయ‌లేక‌పోతున్నామ‌ని వెక్కివెక్కి ఏడుస్తోంది. క‌రోనా విష‌యంలో కోటానుకోట్ల ప్ర‌శ్న‌లు విన‌బ‌డుతున్నా...స‌మాధానం మాత్రం శూన్య‌మేన‌ని చెప్పాలి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: