అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్  విషయంలో  హై కోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ పై ఎల్లోబ్యాచ్ కు సుప్రింకోర్టు షాకిచ్చిందనే అనుకోవాలి. గ్యాగ్ ఆర్డర్ చెల్లదంటూ హైకోర్టు ఆర్డర్ పై సుప్రికోర్టు స్టే విధించింది. పైగా ఇన్ సైడర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తో పాటు మరో 12 మందికి నోటీసులను కూడా జారీ చేయాలని ఆదేశించింది.  దీంతో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన చంద్రబాబునాయుడు అండ్ కో కు టెన్షన్ మొదలైనట్లే అనుకోవాలి. ఎందుకంటే జనవరిలో ఇదే విషయమై జరగబోయే విచారణలో సుప్రింకోర్టు గనుక దమ్మాలపాటి అండ్ ఎనదర్ 12 మందిపై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మొత్త ఎల్లోబ్యాచ్ సమస్యల్లో ఇరుక్కున్నట్లే అనుకోవాలి. చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని పరిధిలో  4075 ఎకరాలను ఇన్ సైడర్ ట్రేడింగ్ పద్దతిలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు, టీడీపీలోని కీలక నేతలు, చంద్రబాబు మద్దతుదారులు సొంతం చేసుకున్నట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. 4075 ఎకరాల్లో ఎవరెవరు ఎంతెంత భూములు సొంతం చేసుకున్నారనే విషయాన్ని కూడా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించేసింది.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీడీపీ ముఖ్యులు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండే వైసీపీ చేస్తోంది. అప్పట్లోనే తమకున్న సమాచారం ప్రకారం ఎవరెవరు ఎంతెంత భూములు దక్కించుకున్నారనే వివరాలను అసెంబ్లీలోనే చదవి వినిపించారు. అయినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగాను స్పందిచలేదు. తాము అధికారంలోకి వస్తే ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపిస్తామని అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అప్పుడు చెప్పినట్లే అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అంతర్గత విచారణలు జరిపించి చివరకు ఏసీబీ విచారణకు ఆదేశించారు. సీబీఐ విచారణకు ఆదేశించినా కేంద్రం స్పందిచని కారణంగా చివరకు ఏసీబీని రంగంలోకి దింపారు. అంతర్గత విచారణలో తాము సంపాదించిన సాక్ష్యాలను, వివరాలను మంత్రివర్గ ఉపసంఘం ఏసీబీకి అందించింది. దాంతో ప్రాధమికంగా దమ్మాలపాటి +12మందిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ మొదలుపెట్టింది.




ఎప్పుడైతే ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని తెలియగానే దమ్మాలపాటి హైకోర్టులో కేసు వేశారు. విచిత్రమేమిటంటే దమ్మాలపాటి తన కేసులో ఎక్కడా విచారణ జరగకూడదని అడగలేదు. విచారణకు సంబంధించిన విషయాలపై మీడియా కవరేజీ ఇవ్వకూడదని అడగలేదు. విచారణ జరగకూడదని అడిగిన దమ్మాలపాటి ఒకవేళ విచారణ జరపాల్సి వస్తే హైకోర్టు పర్యవేక్షణలోనే జరిపేట్లు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారంతే. కానీ కోర్టు మాత్రం అసలు విచారణే జరపకూడదంటూ స్టే ఇచ్చేసింది. విచారణలోని అంశాలపై మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎటువంటి ప్రచారము జరగకుండా గ్యాగ్ ఆర్డర్ ను ఇచ్చేసింది. దమ్మాలపాటి తన విషయమై కోర్టులో కేసు వేస్తే దమ్మాలపాటితో పాటు మిగిలిన 12 మందిపైన కూడా ఒకే ఆర్డర్ ను ఇచ్చేసింది హై కోర్టు. హైకోర్టు వైఖరితో దేశంలోని మీడియా ప్రముఖులు అనేకమంది నిరసన తెలిపారు. దమ్మాలపాటి తో పాటు మిగిలిన 12 మంది కూడా విచారణ జరిపేందుకు లేదని హైకోర్టు ఎందుకు ఆర్డర్ ఇచ్చింది ? ఎందుకంటే 12 మందిలో సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ ఇద్దరు  కూతుర్లు కూడా ఉన్నారు కాబట్టే అని బయటపడిపోయింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో  వీళ్ళిద్దరు కూడా భారీ ఎత్తన భూములు కొన్నట్లు ప్రభుత్వం చెప్పింది. దాంతో విషయం దేశమంతా పాకిపోయింది. ఇంతకాలానికి హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను సుప్రింకోర్టు బ్రేక్ చేసింది. మరి ముందు ముందు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: