ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు భలే పిలుపిచ్చారు. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై మీడియా సమావేశంలో నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. తెచ్చుపెట్టుకున్న ఆవేశంతో పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. ఇంతకీ చంద్రబాబు చెప్పేదేమిటంటే ఉద్యోగులు, పోలీసులు, ప్రజలు ప్రభుత్వంపై తిరగబడాలట. అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు పాటించేందుకు ఇష్టపడని అధికారులు సహాయ నిరాకరణ చేశారట. అలాగే ఇక్కడ కూడా జగన్ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని చంద్రబాబు పోలీసులకు పిలుపివ్వటమే ఆశ్చర్యంగా ఉంది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ప్రతిపక్షనేతగా పనిచేసిన చంద్రబాబు చివరకు ఏ స్ధాయికి దిగజారిపోయాడనే విషయం తాజాగా మీడియా సమావేశంలో ఇఛ్చిన పిలుపును బట్టి అర్ధమైపోతోంది.





అదికారంలో ఎవరుంటే వాళ్ళు చెప్పినట్లు పోలీసులైనా అధికారయంత్రాంగమైన నడుచుకుంటుందనే కనీస ఇంగిత జ్ఞానం కూడా చంద్రబాబుకు లేకపోయింది. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు పోలీసులను ప్రభుత్వ యంత్రాంగాన్ని తానిష్టం వచ్చినట్లు ఉపయోగించుకోలేదా ? అప్పట్లో ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టలేదా ? ప్రతిపక్ష నేతలను కేసులతో వేధించలేదా ? మరపుడు పోలీసులు అదంతా ఎందుకు చేశారు ? ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు, లోకేష్ లేకపోతే కీలక నేతల ఆదేశాల ప్రకారం నడుచుకున్నారు కాబట్టే వైసీపీ నేతలపై కేసులు పెట్టారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టాల గురించి ఇపుడింతగా గొంతుచించుకుని మాట్లాడుతున్న చంద్రబాబు వైసీపీ 23 మంది ఎంఎల్ఏలను, ముగ్గురు ఎంపిలను ఏ రాజ్యాంగం, చట్టం, ప్రజాస్వామ్యం ప్రకారం టీడీపీలోకి లాక్కున్నారు ?





ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రజాస్వామ్యమైనా చట్టమైనా రాజ్యాంగమైనా చంద్రబాబుకు ప్రతిపక్షంలో ఉన్నపుడే గుర్తుకొస్తాయి. అదికారంలో ఉన్నపుడు తానేమి అనుకుంటే అది చేసుకుపోయిన చంద్రబాబు ఇపుడు జగన్ అదేపని చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. హోలు మొత్తం మీద చూస్తే చంద్రబాబుకన్నా జగన్ నయమనే అనిపించుకుంటున్నారు. తాను అధికారంలో ఉన్నపుడు ఎంఎల్ఏలు, ఎంపిలు ఉన్నతాధికారులపై దౌర్జన్యం చేసినా తప్పుగా అనిపించలేదు చంద్రబాబుకు. మొత్తానికి జగన్ ఏడాదిన్నర పరిపాలనలో  చంద్రబాబు బాగా సఫోకేటింగ్ ఫీలవుతున్నట్లు అర్ధమైపోతోంది. అందుకనే హెచ్చరికలు, బెదిరింపులతో పూనకం వచ్చినట్లు ఊగిపోతు నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు. ఇందులో భాగంగానే ఉద్యోగులను, పోలీసులను ప్రభుత్వంపై తిరగబడమని పిలుపిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: