ముస‌లోడికి ద‌స‌రా పండ‌గ - ఈ మాటే..టీడీపీలో వినిపిస్తోంది. నిజానికి టీడీపీ అభిమానుల‌కు తీవ్ర ఇబ్బంది క‌లిగించే ప‌రిణామ‌మే అయిన‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఈ మాటే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం.. పార్టీని న‌డిపిస్తున్న తీరును.. వారు త‌ప్పుబ‌డుతున్నారు. యువ‌త ప్రాధాన్యం చంద్ర‌బాబు ఇంకా గుర్తించ లేక పోతున్నార‌ని అంటున్నారు. గ‌తంలో  ఎన్నిక‌ల‌కు రెండున్న‌ర సంవ‌త్సాలు ఉంద‌న‌గానే వైసీపీ అధినేత దాదాపు చూచాయ‌గా అభ్య‌ర్థ‌ల‌ను ప్ర‌క‌టించేశారు. ఈ ప‌రిస్థితి పార్టీకి మేలు చేసింది. ఎవ‌రికి వారు ఎక్క‌డిక‌క్క‌డ‌.. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప‌నిచేశారు.

అంతేకాదు.. సీఎం గా జ‌గ‌న్ ను చూడాల‌ని ఉవ్విళ్లూరారు. అయితే.. ఇప్పుడు ఇదే ప‌రిస్థితిని చంద్ర‌బాబు కూడా త‌న పార్టీలో తీసుకురావాల‌ని చూస్తున్నారు. కానీ, ఇది ఆయ‌న‌కు సాధ్యం కావ‌డం లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. సాహ‌సం చేయ‌లేక పోవ‌డ‌మే. ఎంత సేపూ.. ఆయ‌న‌కు ఉన్న అల‌వాట్ల‌ను మార్చుకోక‌పో వడ‌మే.  మైకు ప‌ట్టుకుంటే.. అదే ప‌నిగా ఆయ‌న ప్ర‌సంగాలు దంచికొడుతున్నారు.

పోనీ.. ఆ ప్ర‌సంగాల్లో అయినా.. యువ‌త‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించే ప్ర‌య‌త్నాలుచేయ‌డం లేదు. నేను త‌ప్పు చేశాను.. న‌న్ను నేను దిద్దుకుంటాను! అని చెప్ప‌డం ద్వారా.. నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌కే చంద్ర‌బాబు గండి కొట్టుకుం టున్నార‌ని..పార్టీలో పెద్ద చ‌ర్చే సాగుతోంది. ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఆశిస్తున్న‌వారినిప్ర‌క‌టించేందుకు చంద్ర‌బాబు జంకుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్పుడే ప్ర‌క‌టిస్తే.. రేపు ఎవ‌రైనారెబ‌ల్ అవుతారేమో అనే ఆలోచ‌న ఆయ‌నలో క‌నిపిస్తోంది.

ఇలాంటి జంకులు.. ఉంటే.. పార్టీ ఎలా డెవ‌ల‌ప్ అవుతుంద‌నేదివారి ప్ర‌శ్న‌. వాస్త‌వానికి గ‌త ఏడాది కాలంలో చంద్ర‌బాబు జోష్ పెంచారు. ఊరూరా తిరుగుతున్నారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే రెండు సార్లు ప‌ర్య‌టించారు. ఎక్క‌డ అవ‌స‌రం ఉన్నా.. అవ‌కాశం ఉన్నా..వాలిపోతున్నారు.కానీ, ఆయ‌న జోష్ బాగున్నా.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ప‌రిస్థితి భిన్నంగా ఉండ‌డంతో ప‌లు సామెత‌లు పుడుతున్నాయి. మ‌రి చంద్ర‌బాబు ఎలా లైన్‌లో పెడ‌తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: