ఏపీ సీఎం జగన్ సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆ వివరాలు చూస్తే ఔరా అనిపించక మానదు.. అనేక పథకాల ద్వారా జగన్ సర్కారు లక్షల కోట్ల ప్రజలకు పంపిణీ చేస్తోంది. ఒక్క జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా  44.5 లక్షల తల్లులకు 84 లక్షల పిల్లలకు లబ్ధి కలుగుతోంది.. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రూ.13,022 కోట్లు పంపిణీ చేశారు. వైయస్సార్‌ రైతు భరోసా ద్వారా 52.4 లక్షల రైతులకు లబ్ది కలుగుతోంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రైతులకు అందిన లబ్ధి రూ.20,162 కోట్లు.


ఇక వైయస్సార్‌ చేయూత ద్వారా అక్షరాలా రూ.9,180 కోట్లు అందించారు. అలాగే వైయస్సార్‌ ఆసరా ద్వారా ఇప్పటి వరకు 78.75 లక్షల కుటుంబాలకు రూ,12,758 కోట్లు అందించారు. ఇళ్ల పట్టాలు. ఇళ్ల నిర్మాణం ద్వారా ఏకంగా 31 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. ఈ పథకం ద్వారా అంతిమంగా కలిగే లబ్ధి దాదాపు 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లు రూపాయలు. ఉచిత కరెంటు పథకం ద్వారా పల్లెల్లో ఎస్సీ ఎస్టీల్లో 200 యూనిట్లలోపు వాడుకునే కుటుంబాలకు లబ్ది కలుగుతోంది.


వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ద్వారా  18 లక్షల పంప్‌సెట్లకు ఉచిత కరెంట్‌ అందిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్న పథకం ద్వారా 21.5 లక్షల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకూరూ.7,000 కోట్లు, విద్యా కానుక ద్వారా మరో రూ.1500 కోట్లు అందించారు. జగనన్న వసతి దీవెన ద్వారా ఇప్పటి వరకూ రూ.3,230 కోట్లు, జగనన్న గోరుముద్ద ద్వారా ఇప్పటి వరకు రూ. 2,640 కోట్లు ఖర్చు చేశారు.


వ్యవసాయానికి సున్నా వడ్డీ రుణాలు, పంటల బీమా కోసం ఇప్పటి దాకా రూ.5,000 కోట్లు ఖర్చు చేశారు. డ్వాక్రా బృందాలకు సున్నా వడ్డీ రుణాల కోసం ఇప్పటి వరకూ రూ.2,354 కోట్లు, వైయస్సార్‌ పెన్షన్‌ కానుక ద్వారా ఏకంగా రూ.49 వేల కోట్లు ఖర్చు చేశారు. వైయస్సార్‌ నేతన్న నేస్తం ద్వారా ఇప్పటివరకు రూ.982 కోట్లు, జగనన్న చేదోడు ద్వారా ఇప్పటివరకు రూ.594 కోట్లు, జగనన్న తోడు ద్వారా రూ.1416 కోట్లు, వైయస్సార్‌ వాహన మిత్ర ద్వారా రూ.770 కోట్లు ఖర్చు చేశారట. వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పటి దాకా రూ.5750 కోట్లు, వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా కోసం ఇప్పటివరకు రూ.545 కోట్లు, సంపూర్ణ పోషణ ద్వారా ఇప్పటిదాకా రూ.4900 కోట్లు ఖర్చు చేశారట. ఇలా జగన్ వివిధ పథకాల ద్వారా ప్రజలకు డబ్బు పంపిణీ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: